‘పండగ చేస్కో’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ..!

‘పండగ చేస్కో’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ..!

Published on May 23, 2015 6:39 PM IST

Pandaga-Chesuko
ఎనర్జిటిక్ హీరో రామ్ చేస్తోన్న తాజా సినిమా ‘పండగ చేస్కో’ విడుదలకు సిద్ధమౌతోంది. ‘బలుపు’ లాంటి మంచి హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించారు. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఈ మధ్యే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా ‘యూ మై డార్లింగ్’ అనే పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక థియేట్రికల్ ట్రైలర్‌కైతే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఔట్ అండ్ ఔడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయిపోయాయి.

ఇక ఎప్పట్నుంచో అనుకున్నట్లుగానే ఈ సినిమా మే 29నే విడుదలకు సిద్ధమైంది. మే 29న పండగ చేస్కో రిలీజ్ కావట్లేదని, రిలీజ్ వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అవన్నీ పుకార్లేనని, మే 29నే సినిమా విడుదల కానుందని సినిమా యూనిట్ మరోసారి స్పష్టం చేసింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలో వీకెండ్ వెంకట్రావుగా బ్రహ్మానందం అదరగొడతాడనే టాక్ వినిపిస్తోంది. రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పరుచూరి కిరీటి నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు