ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న పవన్ కళ్యాణ్?

ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న పవన్ కళ్యాణ్?

Published on Jun 2, 2015 8:19 AM IST

pawan-kalyan
పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా రెగ్యులర్ షూటింగ్ పోయినవారం ప్రారంభమైంది. ప్రస్తుతం మహారాష్ట్రాలో పూణే సమీపంలో ఒక గ్రామందగ్గర షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి దర్శకత్వంలో ఒక ప్రత్యేక సెట్ ని రూపొందించారు. అనీషా ఆంబ్రోస్ హీరోయిన్.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో నాయికకు స్థానముందని, ఆ పాత్రకోసం ప్రస్తుతం అన్వేషణ జరుగుతుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని పవర్ ఫేం బాబీ తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు