పెళ్లి పుకార్లు కొట్టిపారేసిన పూర్ణ

పెళ్లి పుకార్లు కొట్టిపారేసిన పూర్ణ

Published on Oct 21, 2014 5:55 PM IST

Poorna

‘అవును’, ‘సీమ టపాకాయ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్ పూర్ణ. పూర్ణ చివరిగా వరుణ్ సందేశ్ సరసన నటించిన ‘నువ్వలా నేనిలా’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత పెద్దగా వార్తల్లో లేని పూర్ణ మళ్ళీ వార్తల్లో నిలిచింది. అది కూడా పూర్ణ త్వరలోనే దుబాయ్ కి చెందిన ఓ బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకోనుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఈ పుకార్లని పూర్ణ పూర్తిగా కొట్టిపారేసింది. ‘ప్రస్తుతం పెళ్లి చేసుకోవడం లేదని, తను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు కచ్చితంగా అందరికీ తెలియజేస్తానని’ పూర్ణ చెప్పింది. పూర్ణ ఇటీవలే తను ముఖ్య పాత్ర పోషిస్తున్న ‘అవును 2’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసింది. రవిబాబు డైరెక్షన్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు