‘శ్రీమంతుడు’లో రాహుల్ గెస్ట్ రోల్.

‘శ్రీమంతుడు’లో రాహుల్ గెస్ట్ రోల్.

Published on Mar 5, 2015 10:26 AM IST

rahul-in-sri-manthudu

యువ హీరో రాహుల్ రవీంద్రన్ కు బంపర్ ఆఫర్.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అతిధి పాత్రలో కనిపించే అవకాశం రాహుల్ ను వరించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.

‘మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నుండి ఎంతో నేర్చుకోవచ్చు. చాలా చిన్న పాత్ర.. కానీ, ముఖ్యమైన పాత్ర.’ అని రాహుల్ తెలిపారు. బుధవారం నుండి రాహుల్ షూటింగులో పాల్గొంటున్నారు.

జగపతి బాబు మహేష్ బాబు తండ్రి పాత్రలో నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, సివి మోహన్, ఎర్నేని నవీన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇంకా అధికారికంగా నిర్మాతలు వెల్లడించలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు