ఎన్.టి.ఆర్ సినిమా కోసం రకుల్ ప్రీత్ ఓన్ డబ్బింగ్

ఎన్.టి.ఆర్ సినిమా కోసం రకుల్ ప్రీత్ ఓన్ డబ్బింగ్

Published on Nov 24, 2015 10:45 AM IST

rakul-preethi1
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా వస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎన్.టి.ఆర్ కి జోడీగా కనిపించనుంది. కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ గా పేరు తెచ్చుకొని స్టార్ హీరోలతో చాన్సులు కొట్టేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ సినిమా కోసం చాలా డెడికేట్ గా పనిచేస్తుందని ఇప్పటికే చాలా మంది కితాబులిచ్చారు. ఆమె కూడా మొదటి సినిమా నుంచి తెలుగు భాషని నేర్చుకుంటూ తెలుగుపై బాగానే పట్టు సాధించింది.

ఇప్పుసు సెట్లో తన టీంతో మాట్లాడాలి అన్నా, మీడియాతో మాట్లాడేటప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే మాట్లాడేస్తోంది. సుకుమార్ రకుల్ ప్రీత్ తెలుగు డిక్షన్ బాగానే ఉందని గమనించి నాన్నకు ప్రేమతో తననే డబ్బింగ్ చెప్పమని అప్రోచ్ అయ్యాడు. రకుల్ ప్రీత్ కూడా తన తెలుగు బెటర్ అయితే తన పాత్రకి ఓన్ డబ్బింగ్ చెప్పుకోవాలని చూస్తోంది. ఇప్పుడు సుకుమార్ అడగడంతో ఓకే చెప్పేసింది. డిసెంబర్ లో ఈ మూవీ డబ్బింగ్ వర్క్ మొదలు కానుంది. డబ్బింగ్ స్టార్ అయ్యాక కొన్ని సీన్స్ కి రకుల్ ప్రీత్ చేత డబ్బింగ్ చెప్పించి డిక్షన్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంటే తనతోనే డబ్బింగ్ చెప్పించాలని ఫిక్స్ అయ్యాడు సుకుమార్. త్వరలోనే ఈ చిత్ర టీం ఫైనల్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు