‘వీరప్పన్’ కోసం రూటు మార్చిన వర్మ!

‘వీరప్పన్’ కోసం రూటు మార్చిన వర్మ!

Published on May 25, 2016 8:47 PM IST

veerappan
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా ఓ సంచలనమే! ఎవ్వరూ చెప్పడానికి సాహసించని జీవిత కథలను, నేపథ్యాలను తన సొంతం చేసుకొని పలు రియలిస్టిక్ సినిమాలు తీసే ఆయన, తాజాగా ‘వీరప్పన్’ కథను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ఇదే కథతో కన్నడ, తెలుగు భాషల్లో ‘కిల్లింగ్ వీరప్పన్’ అన్న సినిమా చేసి హిట్ కొట్టగా, ఇప్పుడదే కథను కొద్దిగా మార్చి ‘వీరప్పన్’ పేరుతో హిందీలో తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక కొద్దిరోజులుగా ఈ సినిమా కోసం వర్మ చేపట్టిన ప్రమోషన్స్ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా టీవీ షోల్లో, రియాలిటీ షోల్లో ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే వర్మ, ఈసారి రూటు మార్చి ఈ తరహా ప్రమోషన్స్‌తోనూ సందడి చేశారు. ఈవారం బాలీవుడ్‌లో విడుదల కానున్న సినిమాల్లో వర్మ సినిమాకు ఓ ప్రత్యేక క్రేజ్ వచ్చింది. వీరప్పన్ నేరచరిత్ర చుట్టూ తిరిగే ఈ సినిమాలో సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్రలో కనిపించనున్నారు. లీసా రే సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. హీరో సచిన్ జోషి ఈ సినిమాను నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు