ఎంజీఆర్ బయోపిక్లో సత్యరాజ్ ?

ఎంజీఆర్ బయోపిక్లో సత్యరాజ్ ?

Published on Jun 25, 2017 6:44 PM IST


తమిళనాడు చరిత్రలోని గొప్ప వ్యక్తుల జాబితా తీస్తే దివంగత ఎంజీఆర్ పేరు ముందు వరుసలో ఉంటుంది. సినిమా, రాజకీయ రంగాల్లో అయన వేసిన ముద్ర అలాంటిది. ఇప్పుడు ఈయన జీవితంపైనే సినిమా రూపొందనుంది. నిర్మాణ సంస్థ రమణ కమ్యూనికేషన్స్ ఈ సినిమాను రూపొందించనున్నట్లు ప్రకటించడంతో తమిళుల్లో కొత్త ఆసక్తి నెలకొంది. అదే విధంగా ఎంజీఆర్ అంతటి గొప్ప వ్యక్తి పాత్రను ఎవరు పోషిస్తారనే ప్రశ్న కూడా తలెత్తింది.

తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్న దర్శకుడు బాలకృష్ణన్ నటుడు సత్యరాజ్ అయితే ఎంజీఆర్ పాత్రకు సరిగ్గా సరిపోతారని భావించి ఆయన్ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని, వచ్చే వారంలోనే ఆయన్ను కలుస్తారని తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో, ఒక వేళ నిజమైతే సత్యరాజ్ ఎంజీఆర్ పాత్రను చేయడానికి ఒప్పుకుంటారో లేదో చూడాలి. ‘బాహుబలి’ తరవాత సత్యరాజ్ ఇండియా మొత్తం బాగా పాపాలర్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు