బాలీవుడ్ స్టార్స్ కి ‘సైరా’ స్పెషల్ షో !

బాలీవుడ్ స్టార్స్ కి ‘సైరా’ స్పెషల్ షో !

Published on Sep 20, 2019 3:00 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బాలీవుడ్ లోని కొంతమంది ప్రముఖలకు సైరా స్పెషల్ షోను వేయాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ముఖ్యంగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి అలాగే అమితాబ్ ఫ్యామిలీకి అండ్ అమీర్ ఖాన్ కి మరియు కొంతమంది ప్రముఖలకు ప్రత్యేకంగా త్వరలో స్పెషల్ షో వేయనున్నారని తెలుస్తోంది. ఇక చాలా కాలం నుండి సల్మాన్ ఖాన్ సైరా గురించి తన స్పందనను తెలియజేస్తూ ఉన్నారు.

కాగా రామ్ చరణ్ ప్రసుతం సైరా హిందీ వెర్షన్ ప్రమోషన్ల మీద కూడా శ్రద్ద చూపుతున్నారు. ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు