విశాల్ సరసన హీరోయిన్‌గా తమన్నా!

విశాల్ సరసన హీరోయిన్‌గా తమన్నా!

Published on Apr 28, 2016 1:19 PM IST

vishal-tamanna
తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో అందరికీ దగ్గరైన హీరో విశాల్, తాజాగా సినిమాల విషయంలో స్పీడ్ పెంచేసి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించనున్న ‘కత్తి సందై’ అనే సినిమాను ఈ ఉదయం దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో విశాల్ సరసన, సౌతిండియన్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరైన తమన్నా హీరోయిన్‌గా నటించనుండడం ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు.

తమిళంలో యాక్షన్ చిత్రాలు తీయడంలో మంచి పేరున్న దర్శకుడు సురాజ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా మే నెల మొదటివారంలో సెట్స్‌పైకి వెళుతుందని టీమ్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాక తన స్థాయిని అమాంతం పెంచేసుకున్న జగపతి బాబు ఓ ప్రధాన పాత్రలో నటించనుండడం ఓ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పూర్తిగా యాక్షన్ ఎంటర్‌‌టైనర్ సినిమాగా ఈ సినిమా ఉండనుందని టీమ్ స్పష్టం చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు