‘ఒక మనసు’ను రీమేక్ చేయనున్న తమిళ స్టార్ హీరో?

‘ఒక మనసు’ను రీమేక్ చేయనున్న తమిళ స్టార్ హీరో?

Published on Jun 25, 2016 9:04 PM IST

dhanuSH
మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ఒక మనసు నిన్న విడుదలైన విషయం తెలిసిందే. నాగశౌర్య హీరోగా నటించిన ఈ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీకి మిక్స్‌డ్ రెస్పాన్సే వచ్చినా, ఈ సినిమా కథ నచ్చి తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన స్వయంగా ఈ రీమేక్‌లో నటిస్తారా? లేక తన బ్యానర్‌లో వేరే ఇతర హీరోతో రీమేక్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఒక మనసు రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడం గురించి ధనుష్ దగ్గర్నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇక రామరాజు తెరకెక్కించిన ‘ఒక మనసు’ సినిమా, ఒక రాజకీయ నాయకుడవ్వాలనుకునే యువకుడికి, ఓ డాక్టర్‍కి మధ్యన జరిగే ప్రేమకథగా వచ్చింది. మధుర శ్రీధర్ ఈ సినిమాను టీవీ 9 సంస్థతో కలిసి నిర్మించారు. ధనుష్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారని వార్తలు రావడం ప్రస్తుతం రిలీజ్ తర్వాత సినిమాకు మంచి క్రేజ్ తెస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు