టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కృష్ణమ్మ. మే 10, 2024 న థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. వి వి గోపాల కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగింది.
సెన్సార్ పూర్తి చేసుకున్న విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. అర్చన, కృష్ణ బురుగుల, అతిరా రాజ్, లక్ష్మణ్ మీసాల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ను అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రం థియేటర్ల లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.