ప్రెస్ నోట్ : అన్న నందమూరి తారకరామారావు గారికి డల్లాస్ తెలుగుదేశం అభిమానుల ఘన నివాళులు.
Published on Jun 1, 2014 8:00 am IST

press-realese
తెలుగు వారి ఆత్మగౌరవానికి, వ్యక్తిత్వానికి ప్రతిక తెలుగు ప్రజానిఖం మొత్తం అన్నగారు అని ఆప్యాయంగా పిలుచుకునే నందమూరి తారకరామారావు గారి 92వ జయంతి ఉత్సవాలను 31వ తారికున డల్లాస్ లోని జుబిలీహాల్లో జరుపుకున్నారు. ఈ సందర్భముగా పలువురు వక్తలు, అన్నగారు చేసిన సినిమాలు, అన్నగారి జీవిత విశేషాలు, అన్నగారి రాజకీయ ప్రస్థానం, పార్టీ పెట్టిన 9 నెలల్లో ప్రబుత్వంలోకి రావటం, ప్రజల కనీస అవసరాలు అయిన తినడానికి రెండు రూపాయలకె కిలో బియ్యం పధకం, బడికి వెల్లే పిల్లలకు మద్యన్న భోజన పధకం, పేద ప్రజలకు పక్కా గృహాల పధకం, మంచినిల్లకి తెలుగు గంగ పధకం, కట్టుకోటానికి జనత వస్త్రాలు, రైతులకు తక్కువ ధరకే విద్యుత్త్ సరఫరా, ఇంజనీరింగ్ కళాశాలల్లో డొనేషన్ పద్దతిని తీసేసే ప్రవేశ పరిక్షలు పెట్టటము, మహిళలకు కుటుంబ ఆస్తిలో సగబాగం కల్పించటము లాంటి విభిన్న కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు.

ఇటివల రాష్ట్రములో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రములో నారా చంద్రబాబునాయుడు అద్యక్షతన తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో నరేంద్రమోడి అద్యక్షతన BJP పార్టీని ప్రజలు గెలిపించిన సందర్భముగా డల్లాస్ లోని ఇర్వింగ్ నుంచి కార్రోల్టన్ వరుకు భారి విజయోత్సవ ర్యాలి నిర్వహించారు. ఈ ర్యాలిలో తెలుగుదేశం పార్టీ అభిమానులతో పాటు, BJP పార్టీ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు భారి సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రములో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుబసందర్భముగా NRI TDP USA వాళ్ళు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లైట్ సాయముతో డల్లాస్ నగరం చుట్టూ తిరిగిన AIR BANNER ప్రత్యెక ఆకర్షణగా నిలిచించి.

ఈ సందర్భముగా జరిగిన సభలో, రాష్ట్రంలో రైతులకు, డ్వాక్ర మహిళలకు రుణ మాఫీ చేసి అండగా నిలబడాల్సిన అవసరాన్ని పలువురు వక్తలు గుర్తు చేసారు. రాష్ట్రములో తెలుగుదేశం పార్టీని గెలిపించిన రాష్ట్ర ప్రజలకు ప్రత్యేఖ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు పార్టీ మిధ పెట్టుకున్న విశ్వాసానికి కష్టపడి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా అయ్యేందుకు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు అని ఆకాంక్షించారు.

ఆంధ్ర ప్రదేశ్ నుంచి బాలకృష్ణ, నారా లోకేష్ ప్రసంగించారు. నారా లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉండాల్సిన అవసరాన్ని, పార్టీ చేపట్టిన కార్యకర్తల ఫండ్ గురించి వివరించారు. తెలుగు వాళ్ళు ఇరు రాస్తాల్లోను అభివృద్ధి చెందాలని, పక్క రాష్ట్రాలు రెండు అభివృద్ధి చెంది, తెలుగు ప్రజల గౌరవం ప్రపంచం మొత్తం చాటి చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది అని సభను ఉద్దేశించి చెప్పారు. దేవినేని ఉమా, బోండా ఉమా, గంట శ్రీనివాసరావు, పరిటాల సునీత, ధూళిపాళ నరేంద్ర, గద్దె రామ్మోహన్, శంకర్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారితో తమ అనుభవాలు, రాజకీయాల్లో వాళ్ళకి ఇచ్చిన చేయుత, రామారావు గారి అనితర సాద్యమైన విజయాల గురించి సభకు ఫోన్ ద్వార సందేశం ఇచ్చారు. అన్నగారి పట్టుదల, ఆశయాల సాధనను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని సర్వతోముఖా అభివృద్దికి కృషి చేస్తాము అని పలువురు వక్తలు తమ ప్రసంగాలలో ప్రకటించారు.
NTR

NTR-CelebrationsNTR-Celebrations-(2)

NTR-Celebrations(3)

NTR-Celebrations(4)

 
Like us on Facebook