త్రిష మౌనం వెనకున్న కారణం ఏంటి.?

త్రిష మౌనం వెనకున్న కారణం ఏంటి.?

Published on Apr 27, 2015 8:26 AM IST

trisha-Varun-Mannian
గత 15 సంవ్సత్సరాలుగా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తూ టాప్ హీరోయిన్ గా వెలుగొందిన భామ త్రిష. గత కొద్ది రోజులుగా ఆమెకు అవకాశాల సంఖ్య తగ్గినా, చేసే సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే చేస్తూ విజయాలను అందుకుంటోంది. ఇది కాకుండా త్రిష అందరినీ షాక్ చేసేలా జనవరిలో పారిశ్రామికవేత్త, తమిళ నిర్మాత అయిన వరుణ్‌ మణియన్‌ తో త్రిష నిశ్చితార్ధం జరిగింది. ఈ వేడుకకి అందరూ ఆహ్వానితులు కాకపోయినా ప్రైవేట్ గా గ్రాండ్ గా నిశ్చితార్ద వేడుక జరిగింది.

నిశ్చితార్ధం రోజున వీరి పెళ్లి ఎప్పుసు అనేది అనౌన్స్ చేయకపోయినా మార్చిలోనే వీరి వివాహం ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు మే కూడా వచ్చేస్తోంది, కానీ ఇది వరకూ అసలు పెళ్లి ఊసే లేదు. దీనితో మీడియాలో వీరి పెళ్లి కాన్సల్ అయ్యిందా లేక త్రిష – వరుణ్ విడిపోయారా.? అనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ప్రస్తుతం త్రిష స్పందించి ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. తను క్లారిటీ ఇవ్వకపోతే ఈ రూమర్స్ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

ఈ ఏడాది తమిళంలో ‘ఎన్నై అరింధాల్’ సినిమాతో తమిళంలో హిట్ అందుకున్న ఈ భామ త్వరలోనే తెలుగులో ‘లయన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతే కాకుండా పలు సినిమాలతో బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు