టాప్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ ?

యంగ్ హీరో విజయ్ దేవరకొండకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి, దర్శక, నిర్మాతలు అతనితో సినిమా చెయ్యడానికి ఉత్హాహం చూపిస్తున్నారు. అర్జున్‌రెడ్డి సినిమాలో విజయ్‌దేవరకొండ నటన ప్రముఖ దర్శకుడు మణిరత్నంను బాగా ఆకట్టుకుందట. ఇటీవలే చెన్నైలో సినిమా చూసిన ఆయన విజయ్ దేవరకొండ నటన బాగుందని సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయ్‌దేవరకొండతో కలిసి మణిరత్నం ఓ సినిమా చేసే ఆలోచనలో వున్నారని చెన్నై మీడియా చెబుతుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చనుందని సమాచారం.

మణిరత్నం ప్రస్తుతం దక్షిణాది నాలుగు భాషల్లో ఓ మల్టీస్టారర్ సినిమా చెయ్యడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ లో శింబు, విజయ్‌సేతుపతి, అరవింద్‌స్వామి, ఫాజిల్, జ్యోతిక, ఐశ్వర్య ప్రదాన పాత్రల్లో నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత విజయ్‌దేవరకొండతో మణిరత్నం సినిమా వుంటుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. అర్జున్‌రెడ్డి సినిమా తరువాత విజయ్‌దేవరకొండ పరశురామ్ బుజ్జి దర్శకత్వంలో లవ్ స్టోరి చేస్తున్నారు. త్వరలో మణిరత్నం & విజయ్ దేవరకొండ సినిమాకు సంభందించిన వార్తా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మణిరత్నం తో సినిమా అంటే విజయ్ దేవరకొండ ఫేట్ మారిపోయినట్లే.

 

Like us on Facebook