సమీక్ష : హల్ చల్ – కథాంశం బాగున్నా… కథాకథనాలు ఆకట్టుకోవు !

సమీక్ష : హల్ చల్ – కథాంశం బాగున్నా… కథాకథనాలు ఆకట్టుకోవు !

Published on Jan 4, 2020 3:07 AM IST
Hulchul review

విడుదల తేదీ : జనవరి 03, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు :  రుద్రాక్ష్ , ధన్యా బాలకృష్ణ, కృష్ణుడు తదితరులు.

దర్శకత్వం : శ్రీపతి కర్రి

నిర్మాత‌లు : గణేష్ కొల్లూరి

సంగీతం :  భరత్ మధుసూదనన్

సినిమాటోగ్రఫర్ : రాజ్ తోట

స్క్రీన్ ప్లే : శ్రీపతి కర్రి

రుద్రాక్ష్ , ధన్యా బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా ఎమ్.ఎస్.కె డిజిటల్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై గణేష్ కొల్లూరి నిర్మించిన చిత్రం హల్ చల్. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

రుద్రాక్ష (రుద్రాక్ష్) దుబాయ్ లో నాలుగు సంవత్సరాలు కష్టపడి సంపాదించి ఇక నుండైనా తన తల్లిని బాగా చూసుకోవాలనే ఆశతో ఇండియాకి వస్తాడు. అయితే దుబాయ్ లో తన ఫ్రెండ్ (కృష్ణుడు) ఒక పర్సు అండ్ ఒక మందు బాటిల్ (హల్ చల్) ఇచ్చి ఇండియాలో నరసింహా (విలన్) అనే రౌడీ బ్యాచ్ కి ఇవ్వమని చెబుతాడు. కానీ అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల కారణంగా రుద్రాక్ష డ్రగ్ లాంటి ఆ హల్ చల్ మందును తాగేస్తాడు. దాంతో అతను నిజానికి భ్రమకు మధ్య తేడా తెలియకుండా పోతాడు. ఎప్పుడో తానూ కాలేజీలో ప్రేమించిన స్వాతి (ధన్యా బాలకృష్ణ) మళ్ళీ తన జీవితంలోకి వచ్చినట్లు ఉహించుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్న క్రమంలో.. ఫ్రెండ్ తనకు ఇచ్చిన పర్సులో వంద కోట్లు విలువ చేసే నోటు ఉందని తెలుస్తోంది. కానీ అప్పటికే ఆ పర్సు ఎక్కడో మిస్ అవుతుంది. దాంతో విలన్ బ్యాచ్ రుద్రాక్ష వెంట పడతారు. రుద్రాక్ష వాళ్ళ నుండి తప్పించుకోవటానికి ఏం చేశాడు? ఇంతకీ రుద్రాక్ష మీద ఆ హల్ చల్ డ్రగ్ ప్రభావం ఏ రేంజ్ లో పని చేసింది? చివరికి అతను తన సమస్యల నుండి బయట పడ్డాడా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ సినిమాని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా నటించిన రుద్రాక్ష్ చక్కగా నటించాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ అలాగే కొన్నికన్ ఫ్యూజ్డ్ అండ్ కామెడీ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. ఇక రుద్రాక్ష్ సరసన హీరోయిన్ గా నటించిన ధన్యా బాలకృష్ణ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. విలన్ నరసింహాగా నటించిన నటుడు కూడా చాల బాగా నటించాడు.

అలాగే కమెడియన్ కృష్ణుడు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు శ్రీపతి కర్రి తీసుకున్న స్టోరీ లైన్ బాగుంది. సెకెండ్ హాఫ్ లో హీరో – కృష్ణుడు మధ్య ఆయన రాసుకున్న కొన్ని కామెడీ సీన్స్ మరియు హీరోయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ కూడా పర్వాలేదనిపిసోంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమా ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు.

 

దీనికి తోడు మెయిన్ గా సినిమా గందరగోళంగా సాగుతూ బోర్ కొడుతోంది. సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా బలహీనమైన ఎమోషన్ కి లోబడి బలహీనంగా సాగడం కూడా బాగాలేదు. పైగా సినిమాలో చాల సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి.

 

మొత్తంగా సినిమాను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ.. స్క్రిప్ట్ వీక్ గా ఉండటం కారణంగా అది సాధ్యపడలేదు. అందుకే సినిమాలో దర్శకుడు తీసుకున్న కథాంశం బాగున్నా.. కథాకథనాలు ఆసక్తికరంగా సాగవు.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు భరత్ మధుసూదనన్ అందించిన సంగీతం జస్ట్ పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ట్రీమ్ చేసి చేయాల్సింది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్లుగానే సాగింది. అయితే కొన్ని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. దర్శకుడు సరైన స్క్రిప్ట్ ను రాసుకోవడంలో విఫలం అయ్యారు. ఆయన దర్శకత్వం పర్వాలేదు. ఇక నిర్మాత గణేష్ కొల్లూరి పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కథకు అవసరమైనంత ఖర్చు పెట్టారు.

 

తీర్పు :

 

‘హల్ చల్’ అంటూ వినూత్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం.. నమ్మశక్యం కాని ట్రీట్మెంట్ తో ఆసక్తికరంగా సాగని కథాకథనాలతో ఆకట్టుకోలేకపోయింది. కాకపోతే, కొన్ని కామెడీ సీన్స్ తో అక్కడక్కడా నవ్వించడం, అలాగే దర్శకుడు తీసుకున్న కథాంశం వంటి అంశాలు బాగున్నాయి. కానీ, సినిమాలో ఇంట్రస్ట్ తో పాటు క్లారిటీ కూడా మిస్ అవ్వడం, అలాగే నాటకీయత మరీ పరిధులు దాటేయడం, మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ ఎక్కువవ్వడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

 

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు