పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇప్పుడు పవన్ సైడ్ నుంచి ఓ పక్క పొలిటికల్ పరంగా సినిమా పరంగా కూడా మంచి సందడి వాతావరణం కనిపిస్తుంది. ఆఫ్ లైన్ లో అనేక చోట్ల పవన్ కనిపిస్తూ ఉండటం గత కొన్ని రోజులు నుంచి పవన్ సినిమా “హరిహర వీరమల్లు” (Hari Hara Veeramallu) అప్డేట్స్ కూడా హోరెత్తించడంతో రెండు రకాలుగా ట్రీట్స్ వస్తున్నాయి.
అయితే దీనికి మించి అసలైన ట్రీట్ ఈ ఏడాదిలోనే రాబోతున్నట్టుగా ఇవాళ ఫిక్స్ అయ్యింది. దీనితో ఈ ఏడాదిలో పవన్ ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా ఫిక్స్ అయ్యినట్టు చెప్పాలి. ఆల్రెడీ దర్శకుడు సుజీత్ తో ప్లాన్ చేసిన భారీ చిత్రం “ఓజి” (They Call Him OG) సెప్టెంబర్ 27 ఇండస్ట్రీ హిట్ రిలీజ్ ని లాక్ చేసుకుంది. ఇప్పుడు వీరమల్లు కూడా 2024 అని అంటున్నారు.
అయితే ఇది ఎలా సాధ్యం అవుతుంది అనేది ప్రశ్నగా మారింది. వీరమల్లు చాలా షూటింగ్ బ్యాలన్స్ ఉంది. పవన్ ఎన్నికల తర్వాత వెంటనే ఇది మొదలు పెట్టి కంప్లీట్ చేసినా కూడా ఓజి కంటే ముందే రావడం అనేది అసాధ్యం. కనుక వస్తే దీపావళి రేస్ లో కానీ డిసెంబర్ లో సాధ్యపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కానీ పవన్ జాయిన్ అయ్యి ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే నాలుగేళ్ళు అయ్యింది కానీ ఈరోజు టీజర్ తో ఆలస్యం అయినా సాలిడ్ కంటెంట్ తో మేకర్స్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి వేచి చూడాలి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది.