ఫోటో మోమెంట్ : శంకర్ కూతురి రెసెప్షన్ లో సందడి చేసిన చిరు, చరణ్ ఫ్యామిలీస్

ఫోటో మోమెంట్ : శంకర్ కూతురి రెసెప్షన్ లో సందడి చేసిన చిరు, చరణ్ ఫ్యామిలీస్

Published on Apr 16, 2024 4:22 PM IST


కోలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన దిగ్గజ దర్శకుడు శంకర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ మూవీతో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2 మూవీ చేస్తున్నారు. వీటిలో భారతీయుడు 2 జూన్ లో అలానే గేమ్ ఛేంజర్ అక్టోబర్ లో రిలీజ్ కానున్నాయి. విషయం ఏమిటంటే, తాజాగా శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం తరుణ్ కార్తికేయన్ తో జరిగింది.

ఇక నేటి వీరి రెసెప్షన్ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులని ఆశీర్వదించారు. విషయం ఏమిటంటే, ఆ వేడుకకి కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా తమ భార్యా సమేతంగా విచ్చేసి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు. కాగా ఆ వేడుకలో వారు సందడి చేసిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు