కమ్ బ్యాక్ కి సిద్దమైన ఇంద్రజ

కమ్ బ్యాక్ కి సిద్దమైన ఇంద్రజ

Published on Sep 8, 2014 1:09 PM IST

Indraja
గతంలో యమలీల సినిమాలో ‘నీ జీను ప్యాంటు చూసి కుర్రోడ’ అనే పాటతో కుర్రకారుని ఒక ఊపు ఊపిన హీరోయిన్ ఇంద్రజ. 1999లో తెలుగులో చివరి సినిమా చేసిన ఇంద్రజ మళ్ళీ ‘దిక్కులు చూడకు రామయ్యా’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ 19న జరగనుంది.

ఇంద్రజ తన కమ్ బ్యాక్ మూవీ గురించి మాట్లాడుతూ ‘ గతంలో కూడా నాకు మదర్ పాత్రలు వచ్చాయి కానీ వాటికి కథలో ప్రాధాన్యం లేక ఒప్పుకోలేదు. ‘దిక్కులు చూడకు రామయ్యా’లో నా పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంది. అజయ్ కి భార్యగా, హీరో నాగ శౌర్యకి మదర్ గా కనిపిస్తాను. నా కమ్ బ్యాక్ మూవీ ఘనత మాత్రం సాయి కొర్రపాటి, డైరెక్టర్ త్రికొఠికే చెందుతుందని’ తెలిపింది.

నాగ శౌర్య సరసన సన హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు