బ్రెజిల్ గాయనితో కలసి పనిచేస్తున్న ఏఅర్ రెహమాన్

బ్రెజిల్ గాయనితో కలసి పనిచేస్తున్న ఏఅర్ రెహమాన్

Published on Sep 11, 2014 6:18 PM IST

pele
ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్, ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఅర్ రెహమాన్ బ్రెజిల్ సింగర్ అన్నా బెట్రిజ్ తో కలసి పని చేస్తున్నారు. ది గ్రేట్ ఫుట్ బాల్ ప్లేయర్ ‘పీలే’ జీవితగాధ ఆధారంగా ఇంగ్లీష్ లో ‘పీలే’ అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు రెహమాన్ సంగీత దర్శకుడు. రెహమాన్ కంపోజ్ చేసిన ట్యూన్ లకు లిరిక్స్ అందించడంతో పాటు స్వయంగా పాడనుంది అన్నా బెట్రిజ్. ఈ వార్తను రెహమాన్ ట్విట్టర్ లో దృవీకరించారు.

తమిళంలో రెహమాన్ సంగీతం అందించిన విక్రమ్ – శంకర్ ల ‘ఐ’ (తెలుగులో మనోహరుడు) ఆడియో సెప్టెంబర్ 15న విడుదలవుతుంది. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ ష్క్వార్జ్ నెగ్గర్ తో పాటు పలువురు సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు హాజరుకానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు