మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం కావడానికి సిద్దమైన మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా అన్ని ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు నిన్ననే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ నుండి ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. అంతే కాకుండా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు ఈ సినిమా బాగుందని పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడం వలనే సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చిందని ఈ చిత్ర టీం అంటోంది.
ఈ సినిమా చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది.సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు – హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు. ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.


