అత్తారింటికి దారేదీ తరహాలోనే S/O సత్యమూర్తి క్లైమాక్స్!

అత్తారింటికి దారేదీ తరహాలోనే S/O సత్యమూర్తి క్లైమాక్స్!

Published on Mar 26, 2015 12:19 PM IST

Son-of-satyamurty
‘అత్తారింటికి దారేదీ’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్, ‘రేసు గుర్రం’తో బంపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్‌తో కలిసి చేస్తున్న చిత్రం.. సన్నాఫ్ సత్యమూర్తి. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘జులాయి’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే! ఇప్పుడదే కాంబినేషన్ మళ్ళీ మ్యాజిక్‌ని రిపీట్ చేసే పనిలో పడింది. దేవీశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు ఇప్పటికే విడుదలై హల్‌చల్ చేస్తున్నాయి. మెగా అభిమానులతో పాటు, మొత్తం తెలుగు పరిశ్రమే ఈ సినిమా కోసం ఎదురు చూస్తుందంటే అతిశయోక్తి కాదు.

తాజాగా ఈ సినిమా క్లైమాక్స్‌కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అత్తారింటికి దారేదీ తరహాలోనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి క్లైమాక్స్ అత్తారింటికి దారేదిని మించేలా ఉందని తెలుస్తోంది. అత్తారింటికి దారేదీ సినిమాలోని భావోద్వేగపూరిత క్లైమాక్స్ సినిమా విజయంలో ఎంత గొప్ప పాత్ర పోషించిందో తెలిసిందే. ఇప్పుడు సన్నాఫ్ సత్యమూర్తికి కూడా ఈ పార్ట్ చాలా కీలకమని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 8న కానీ, 9న కానీ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు