
తారక్ తాజా బ్లాక్ బస్టర్ టెంపర్ విడుదలైన నాటినుండీ ప్రేక్షకాదరణ పొందుతుంది. విడుదలైన అన్ని సెంటర్ లలో మంచి కలెక్షన్లను సాధిస్తూ 50రోజులను పూర్తిచేసుకుంది. తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచింది.
ఈ సినిమాను తెరకెక్కించిన పూరి జగన్నాధ్ తారక్ పాత్రను చాలా స్పెషల్ చిత్రీకరించాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాలలో తెరకెక్కించిన తీరు అమోఘమనే చెప్పాలి. కాజల్ అగర్వాల్ హీరోయిన్. బండ్ల గణేష్ నిర్మాత.

