స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అంతా ఊహించినట్లుగానే ‘సరైనోడు’తో ప్రేక్షకులకు ముందుకు వచ్చేసి మంచి కలెక్షన్స్ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్కు టార్గెట్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వేసవి సెలవులు కావడం, ఈ సినిమాకు మొదట్నుంచీ మంచి క్రేజ్ ఉండడం.. ఇలా అన్ని అంశాలూ కలుపుకొని ‘సరైనోడు’ సినిమా మొదటి వారం 45.72 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.
నైజాం, ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఒక్క నైజాంలోనే మొదటి వారం 11.36 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి ‘సరైనోడు’ పేరు నిలబెట్టుకున్నాడు. ఇక ప్రాంతాల వారీగా మొదటి వారం కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
ఏరియా |
కలెక్షన్స్ (షేర్) |
నైజాం | 11.36 కోట్లు |
సీడెడ్ | 6.80 కోట్లు |
కృష్ణా | 2.28 కోట్లు |
గుంటూరు | 3.24 కోట్లు |
నెల్లూరు | 1.36 కోట్లు |
తూర్పు గోదావరి | 2.90 కోట్లు |
పశ్చిమ గోదావరి | 2.60 కోట్లు |
వైజాగ్ | 4.43 కోట్లు |
కర్ణాటక | 5.96 కోట్లు |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.09 కోట్లు |
ఓవర్సీస్ | 3.70 కోట్లు |
మొత్తం | 45.72 కోట్లు |