నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఐతే, ఈ చిత్రంలో ఇప్పుడు మరో హీరోయిన్ కనిపించబోతుంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ కీలక పాత్రలో నటించబోతుంది. ఐతే, ఆమె పాత్ర హీరోయిన్ పాత్ర కాదు అని, ఓ సరికొత్త పాత్రలో కాజల్ అగర్వాల్ నటించబోతుంది అని తెలుస్తోంది.
ముఖ్యంగా కాజల్ అగర్వాల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. ఈ పాత్రను దర్శకుడు బాబీ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. కాగా ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.