హీరోయిన్ భావన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. మహాత్మ, ఒంటరి సినిమాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. ఐతే, హీరోయిన్ గా తన కెరీర్ పై భావన తాజాగా స్పందించింది. అలాగే, తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన రూమర్స్ గురించి కూడా హీరోయిన్ భావన కామెంట్స్ చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భావన మాట్లాడుతూ.. ‘నేను పలుమార్లు అబార్షన్ చేయించుకున్నానని ప్రచారం చేశారు’ అని ఆమె ఎమోషనల్ అయ్యారు.
హీరోయిన్ భావన ఇంకా మాట్లాడుతూ.. ‘కొన్ని సార్లు నేను చనిపోయానని కూడా కొందరు మాట్లాడారు. అలాగే, నేను ఎందరితోనో ఎఫైర్ పెట్టుకున్నాను అని, నేను ఒక బజారు మనిషిని అని నా పై పుకార్లు వ్యాప్తి చేశారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.పైగా ఇలాంటి పుకార్ల కారణంగా నేను మెంటల్‌గా చాలా ఇబ్బంది పడ్డాను. వాటిని గుర్తు చేసుకుంటే చిరాకు వేస్తుంది. ఐతే, ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను’ అని హీరోయిన్ భావన తెలిపింది.