ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్న ఓ సెక్షన్ ఆఫ్ మీడియా!?

ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్న ఓ సెక్షన్ ఆఫ్ మీడియా!?

Published on May 5, 2024 7:02 PM IST

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర భారీ మార్కెట్ ఉన్న అతి కొద్ది మంది స్టార్ హీరోస్ లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకడు అని చెప్పాలి. బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన క్రేజ్ తో తన సినిమాలకి సెన్సేషనల్ మార్కెట్ ని సెట్ చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు రానున్న రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ తో పలకరించబోతున్నాడు.

అయితే ఈ క్రమంలో తనకి ఆదరణతో పాటుగా తనని నెగిటివ్ చేయాలని చూసేవారు కూడా పెరిగారు. అలా ఇప్పుడు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రభాస్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సినిమాలు వసూళ్లే సాధించడం లేదని రీసెంట్ గా వచ్చిన సలార్ కూడా టీఆర్పీ రేటింగ్ సాధించలేకపోయింది అని పలు రకాల నెగిటివ్ అంశాలతో సోషల్ మీడియాలో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా టార్గెట్ చేస్తున్నారు.

అయితే వాళ్ళకి అర్ధం కాని విషయం ఏమిటంటే ఎవరూ కూడా ఫలానా హీరో మీద కానీ తన మార్కెట్ మీద కానీ నమ్మకం లేకుండా తన దగ్గరకి వెళ్ళరు. అలా తాను మాత్రమే పర్ఫెక్ట్ అనుకునే బాహుబలి (Bahubali), ఆదిపురుష్(Adipurush) ఇప్పుడు కల్కి (Kalki 2898 AD) లాంటి ఎంతో బలమైన పాత్రలు తన దగ్గరికి తీసుకెళ్లారు. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ వాటిలో ఇమిడి ఒక్క రోజులోనే 100 కోట్లకి పైగా వసూళ్లు బాక్సాఫీస్ దగ్గర కొల్లగొడుతున్నాడు. సో ప్రభాస్ ని కావాలని టార్గెట్ చేసినా ప్రభాస్ క్రేజ్ మరియు మార్కెట్ లు పెరగడం తప్ప తగ్గేదే ఉండదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు