ఓటిటిలో వచ్చాక “మంజుమ్మల్ బాయ్స్” కి రెస్పాన్స్ ఇదే

ఓటిటిలో వచ్చాక “మంజుమ్మల్ బాయ్స్” కి రెస్పాన్స్ ఇదే

Published on May 5, 2024 6:00 PM IST

ఈ ఏడాదిలో మన దక్షిణాది సినిమా నుంచి వచ్చిన పలు సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో మళయాళ సరికొత్త ఇండస్ట్రీ హిట్ చిత్రం “మంజుమ్మల్ బాయ్స్” కూడా ఒకటి. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కించాడు. మరి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లులో ఆడియెన్స్ కి ఓ రేంజ్ ఎక్స్ పీరియన్స్ ని అందించింది.

తెలుగు సహా మళయాళ తమిళ్ ఆడియెన్స్ కి కూడా విపరీతంగా నచ్చింది. అయితే ఈ చిత్రం ఈరోజే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి రీసెంట్ గా వచ్చిన పలు చిత్రాలకి ఓటిటిలో ఒకలా థియేటర్లులో ఒకలా ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు మంజుమ్మల్ బాయ్స్ విషయానికి వస్తే ఈ సినిమా మాత్రం మిగతా వాటిలా కాకుండా ఓటిటిలో కూడా బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఓటిటిలో చూసిన వీక్షకులు దాదాపు యూనానిమస్ గా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ నే సోషల్ మీడియాలో అందిస్తున్నారు అలాగే పలువురు విమర్శకులు కూడా పాజిటివ్ గానే చెబుతున్నారు. వీటితో ఈ చిత్రం ఓటిటిలో కూడా అదరగొట్టింది అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు