‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ప్రస్తుతం ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ పై ఓ అదిరిపోయే అప్ డేట్ వినిపిస్తోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాలో తారక్ వేటాడే సింహంలా సిక్స్ ప్యాక్ తో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ టెక్నీక్స్ తో యాక్షన్ చేస్తాడని.. పైగా ఎన్టీఆర్ పై వచ్చే ఫైట్స్ అన్ని చాలా స్టైలిష్ గా ఉంటాయని తెలుస్తోంది. ‘వార్ 2’ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్స్ లో ఎన్టీఆర్ స్టైలిష్ ఫైట్స్ మెయిన్ గా ఉంటాయని టాక్.
ఏది ఏమైనా ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ షేక్ అయినట్టే. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు ‘వార్ 2’ కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.