విషాదం : ‘టైటానిక్’ నటుడు మృతి

విషాదం : ‘టైటానిక్’ నటుడు మృతి

Published on May 5, 2024 11:00 PM IST

ప్రముఖ హాలీవుడ్ నటుడు, టైటానిక్ ఫేమ్ బెర్నార్డ్ హిల్ ఇక లేరు. 79 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు. టైటానిక్‌ సినిమాలో ఆయన కెప్టెన్ ఎడ్వర్డ్‌ స్మిత్‌ పాత్రతో మెప్పించారు. భాషలతో సంబంధం లేకుండా అన్ని రకాల సినీ అభిమానులను బెర్నార్డ్ హిల్ ఆకట్టుకున్నారు. ఆయన భారతీయ సినీ అభిమానులకు కూడా సుపరిచితుడు. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ తదితర చిత్రాల్లోనూ తన విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు బెర్నార్డ్ హిల్.

కాగా 1944లో యూకేలోని మంచెస్టర్‌లో బెర్నార్డ్ హిల్ జన్మించారు. మొదట పలు చిత్రాల్లో, టీవీ సీరియల్స్‌లో బెర్నార్డ్ హిల్ నటించారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు, సినీ అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. మా 123తెలుగు.కామ్ తరఫున బెర్నార్డ్ హిల్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు