ఉద్దానం సభలో భావోద్వేగంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ !

ఉద్దానం సభలో భావోద్వేగంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ !

Published on Jan 3, 2017 12:20 PM IST

pawan-m
శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంలోని మణికంఠ థియేటర్లో ఉద్దానం కిడ్నీ బాధితులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ బాధితుల సమస్యలు విని భావోద్వేగానికి లోనయ్యారు. ‘ నేను ఇక్కడికి రాజకీయ ప్రయోజనం కోసం రాలేదు. ప్రజల బాధ తెలుసుకోవడానికే వచ్చాను. కొన్ని దశాబ్దాల నుంచి మన రాష్ట్రంలో వేల మంది కిడ్నీ వ్యాధి బారినపడి చనిపోతున్నారు. అయినా ఏ ప్రజానాయకుడు పట్టించుకోలేదు. ఇకనైనా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి. దీనిపై సమగ్ర నివేదిక కోసం కమిటీని ఏర్పాటు చేశాను’ అన్నారు.

అలాగే ‘రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ సెంటర్లు పెట్టామని అంటోంది. డయాలసిస్ అంటే చనిపోయే స్టేజిలో చేసేదే తప్ప బ్రతికించేది కాదు. మా పిన్నిగారి భర్త ఇలానే చనిపోయారు. ఆ భాధ ఎలా ఉంటుందో నాకు తెలిసు. పుష్కరాల కోసం, రాజధాని కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదు’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బాధితులు కూడా తమ బాధలను చెప్పుకుని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు