‘వార్ – 2’ కి వర్క్ చేయనున్న నేషనల్ అవార్డు విన్నింగ్ కొరియోగ్రాఫర్ ?

‘వార్ – 2’ కి వర్క్ చేయనున్న నేషనల్ అవార్డు విన్నింగ్ కొరియోగ్రాఫర్ ?

Published on Apr 30, 2024 11:05 PM IST

గ్లోబల్ యాక్టర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ హీరోలుగా కియారా అద్వానీ హీరోయిన్ గా యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ వార్ 2. ఈ మూవీని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ప్రీతం సంగీతం అందిస్తున్నారు. ఇక ఈమూవీలో ప్రత్యేకంగా ఎన్టీఆర్, హృతిక్ ల పై ఒక పవర్ఫుల్ డ్యాన్స్ సాంగ్ ఉండనుందని ఇప్పటికే న్యూస్ వచ్చింది.

అయితే లేటెస్ట్ బాలీవుడ్ బజ్ ప్రకారం ఈ సాంగ్ కి నేషనల్ అవార్డు విన్నింగ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ డ్యాన్స్ కంపోజ్ చేయనున్నారట. ఆమె ఇటీవల అట్లీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా రూపొందిన జవాన్ లోని నాట్ రామయ్యా వస్తావయ్యా ట్రాక్ కి డ్యాన్స్ కంపోజ్ చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. కాగా వార్ 2 సాంగ్ డ్యాన్స్ తో పాటు ట్యూన్ కూడా అందరినీ అలరించేలా సిద్ధం చేస్తున్నారట. ప్రస్తుతం ముంబైలో వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2025 స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు