
ఇళయదళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో ప్రముఖ యువ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించింది. తాజాగా ఆమె తన పాత్రకు డబ్బింగ్ చెపుతుంది. ఒక్క తమిళంలోనే కాదు ఈ చిత్రం తెలుగులోనూ విడుదలవుతున్నందున తెలుగు వెర్షన్ కు కూడా ఆమె డబ్బింగ్ చెప్పుకుంటుంది.
తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఆమె కు ఇదే మొదటిసారి. ఇక ఈచిత్రం తోపాటు విశాల్ నటించిన ‘పందెంకోడి 2’చిత్రంలోను ప్రతినాయకురాలి పాత్రలో నటించింది వరు శరత్ కుమార్. ఈచిత్రానికి కూడా ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పనుంది.
ఇక ఈరెండు చిత్రాల్లో కీర్తి సురేష్ కథానాయికగా నటించడం విశేషం. వీటిలో పందెంకోడి 2అక్టోబర్ 18న విడుదలకానుండగా,సర్కార్ నవంబర్ 6న ప్రేక్షకులముందుకు రానుంది.

