ఫస్ట్ సింగిల్ తో రానున్న ’90 ఎంఎల్’ !

ఫస్ట్ సింగిల్ తో రానున్న ’90 ఎంఎల్’ !

Published on Oct 13, 2019 9:09 PM IST

90ML

హీరో కార్తికేయ కొత్త చిత్రం 90ఎంఎల్. కాగా తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘వినింపించుకోరు’ సాంగ్ ప్రోమోను రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ కానుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. జేబులో ఎప్పుడు లిక్కర్ బాటిల్ మైంటైన్ చేసే డ్రింకర్ లవర్ గా కార్తికేయ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ చిత్ర ట్యాగ్ కూడా యాన్ ఆథరైజ్డ్ డ్రింకర్ అని ఉండటం ఆసక్తి రేపుతుంది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శేఖర్ రెడ్డి ఎర్రా తెరకెక్కిస్తున్నారు.

కావాలని దేవదాసు లాంటి కొడుకుని కన్న తల్లి, 90ఎంఎల్ లేనిదే పూట గడవని యంగ్ ఫెలోల కథే 90ఎంఎల్. కాగా కార్తికేయ సరసన హీరోయిన్ గా నేహా సోలంకి చేస్తుండగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అలీ, పోసాని, రావు రమేష్, అజయ్, రవి కిషన్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు