మెగాస్టార్ చిరంజీవితో ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా ఒక క్రేజీ సినిమా చేయబోతున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బుచ్చిబాబు ఇప్పటికే చిరు కోసం ఒక పవర్‌ఫుల్ లైన్ సిద్ధం చేశారని, త్వరలోనే మెగాస్టార్‌కు నరేషన్ ఇవ్వబోతున్నారంటూ ఊహాగానాలు షురూ అయ్యాయి.
అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఫిల్మ్‌నగర్ సమాచారం. బుచ్చిబాబు ప్రస్తుతం తాను చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్‌పైనే పెట్టాడట. మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లోనే ఆయన నిమగ్నమై ఉన్నాడు తప్ప, ప్రెజెంట్‌కి వేరే ఏ హీరో కథపైనా వర్క్ చేయడం లేదని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా లైనప్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు.
దర్శకుడు బాబీ ప్రాజెక్ట్‌తో పాటు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లోని సినిమాకు ఆయన ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇవి కాకుండా మరో రెండు కొత్త కథలు చర్చల దశలో ఉన్నాయి. ఇలా ఇద్దరూ తమ తమ కమిట్‌మెంట్లతో బిజీగా ఉన్న సమయంలో ఈ ప్రచారం తెరపైకి రావడం కేవలం ఒక సోషల్ మీడియా రూమర్ మాత్రమేనని స్పష్టమవుతోంది.


