‘సమంత’ భారీ స్టంట్స్ చేస్తోందట ?

‘సమంత’ భారీ స్టంట్స్ చేస్తోందట ?

Published on Oct 13, 2019 9:35 PM IST

Samantha2

వరుస హిట్లతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌ గా ఫుల్ బిజీగా ఉన్న ‘సమంత’ త్వరలో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ లో నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసింది. ఈ మధ్య సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. పైగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌ పెరుగుతుండటంతో సినీ స్టార్స్‌ కూడా వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలా సమంత కూడా ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించింది.

రాజ్‌ అండ్ డీకే దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌, ప్రియమణి, మనోజ్‌ బాజ్‌పాయ్‌ మెయిన్ పాత్రల్లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ మంచి హిట్ అయింది. ఈ సిరీస్‌ కు బాగా రెస్సాన్స్‌ రావటంతో.. ఈ సిరీస్‌ ను కంటిన్యూ చేయనున్నారు. అయితే ఈ సిరీస్ రెండో సీజన్‌ లోనే సమంత పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. పైగా సమంత భారీ స్టంట్స్ చేస్తూ యాక్షన్ సన్నివేశాల్లో నటించబోతుందట. ఉంటుందిట. అందుకోసం మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ కూడా తెలుసుకుంటుందట. వచ్చే వారం నుంచి సమంత షూటింగ్ కు హాజరు కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు