ఆది, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్ లుగా, నాజర్, ప్రకాష్ రాజ్, మునిష్ కాంత్, బ్రహ్మాజీ, కృష్ణ కురూప్ కీలక పాత్రల్లో పృథ్వీ ఆదిత్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం క్లాప్. ఈ చిత్రం కి సంగీతం మాస్ట్రో ఇళయరాజా అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి మనసుతో చూడలేని అంటూ ఒక పాట విడుదల అయ్యింది. ఈ చిత్రం కి సంగీతం అందిస్తున్న ఇళయరాజా పాడటం జరిగింది. ఈ పాటకు లిరిక్స్ రామ జోగయ్య శాస్త్రి రాయడం జరిగింది.
ఈ పాటకి సర్వత్రా విశేష ఆదరణ వస్తోంది. అయితే ఈ పాటకి వస్తున్న రెస్పాన్స్ పట్ల రామ జోగయ్య శాస్త్రి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నా జీవితం లో అద్భుతం జరుగుతోంది అంటూ చెప్పుకొచ్చారు. మనసుతో చూడలేని పాటకి మంచి స్పందన వస్తోంది అని, మైల్ స్టోన్ గా ఈ పాట నిలుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఇళయరాజా గారికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు.


