మెగాస్టార్ “ఆచార్య” నుండి భలే భలే బంజారా సాంగ్ ప్రోమో రిలీజ్!

మెగాస్టార్ “ఆచార్య” నుండి భలే భలే బంజారా సాంగ్ ప్రోమో రిలీజ్!

Published on Apr 17, 2022 5:21 PM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం కోసం మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం లో రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తుండటం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి భలే భలే బంజారా సాంగ్ ప్రోమో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించారు. సిరుత పులుల సిందాట పేరిట చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లు ఇద్దరూ కూడా ఈ పాటలో కలిసి స్టెప్పులు వేయడం జరిగింది. ఈ ప్రోమో సాంగ్ విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ను కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకాల పై నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రోమో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు