పృథ్వీరాజ్ “కడువా” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్!

పృథ్వీరాజ్ “కడువా” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Jul 29, 2022 3:03 PM IST


మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కడువ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. జూలై 8, 2022 న విడుదలైన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్‌గా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించడం జరిగింది.

ఆగస్ట్ 4, 2022 న కడువా చిత్రం ప్రైమ్ వీడియోలో వస్తుందని ప్రకటించింది. పెద్ద స్క్రీన్‌లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు వచ్చే వారం నుండి ఓటిటి లో చూసేందుకు అవకాశం ఉంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటించిన ఈ పీరియడ్ యాక్షన్ మూవీలో సంయుక్త మీనన్ పృథ్వీరాజ్‌ సరసన హీరోయిన్ గా నటించింది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మరియు మ్యాజిక్ ఫ్రేమ్స్ నిర్మించాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు