ఎన్టీఆర్ ఒక్కో యాడ్‌కు ఎన్ని కోట్లు తీసుకుంటాడంటే ?

ఎన్టీఆర్ ఒక్కో యాడ్‌కు ఎన్ని కోట్లు తీసుకుంటాడంటే ?

Published on Nov 27, 2022 8:57 PM IST

తెలుగు పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేకమైన నటుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. తాతగారు సీనియర్ ఎన్టీఆర్ గారి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఎన్టీఆర్ తాతకు తగ్గ మనువడిగా ఎప్పుడో తెలుగు చలన చిత్ర పరిశ్రమ పై తనదైన ముద్రను వేశారు. పైగా ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా పాపులారిటీ దక్కించుకున్నాడు తారక్. అందుకే పలు వాణిజ్య ప్రకటనలు ఇప్పుడు ఎన్టీఆర్ ను వెతుక్కుంటున్న వస్తున్నాయి. ఎలాగూ కొరటాల శివతో చేస్తున్న సినిమా షూటింగ్ కి గ్యాప్ రావడంతో ఎన్టీఆర్ కూడా పలు యాడ్స్ లో నటిస్తున్నాడు.

రీసెంట్ గానే ఎన్టీఆర్ ఓ ప్రముఖ మాంసం డెలివరీ సంస్థకు సంబంధించిన ప్రకటనలో కనిపించారు. ఐతే, ఇంతకీ ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ? అని హాట్ టాపిక్ అయింది. ఒక్కో యాడ్ కోసం ఎన్టీఆర్ రూ.3 కోట్లు నుంచి రూ.4 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ నృత్యం అమోఘం, ఎన్టీఆర్ ఉచ్చారణ అనిర్వచనీయం. నటన అద్భుతం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు