ఆకట్టుకుంటున్న ‘బెదురులంక 2012’ ఫస్ట్ గ్లింప్స్ టీజర్

ఆకట్టుకుంటున్న ‘బెదురులంక 2012’ ఫస్ట్ గ్లింప్స్ టీజర్

Published on Dec 21, 2022 7:19 PM IST

యువ నటుడు కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా బెదురులంక 2012. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పనేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో కార్తికేయ సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా ఇటీవల సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేడు కొద్దిసేపటి క్రితం ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’ పేరుతో ఒక వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ గ్లింప్స్ లో పల్లటూరి నేపథ్యం, అలానే కొన్ని రొమాంటిక్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు చూపించారు.

అయ్ బాబోయ్, ఆగలేం రోయ్, వచ్చేయండ్రోయ్, వెయిటింగ్ ఇక్కడ అనే మాంటేజ్ సాంగ్ వినిపిస్తున్న సమయంలో ఫుడ్ కోసం వెయిటింగ్ చేస్తున్న జనాలు అందరూ ఒక్కసారిగా తిండి మీద పడితే ప్రేమ కోసం పరితపించే జంటను మరోవైపు చూపించారు. మొత్తంగా ఇంట్రెస్టింగ్ గా ఒక నిమిషం పాటు సాగిన బెదురులంక 2012 గ్లింప్స్ ప్రస్తుతం ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటోంది. 2012 యుగాంతం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ తెలిపారు.

ఇక ఈ టీజర్ రిలీజ్ అనంతరం బెన్నీ ముప్పనేని మాట్లాడుతూ, మా సినిమా చిత్రీకరణ అంతా చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగులో జరుపుకుంటోందని అన్నారు. ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులు అందరినీ నవ్వించే కొత్త తరహాలో సాగుతుందని, ఇందులో డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ కలిసి ఉంటాయని అన్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న బెదురులంక 2012 మూవీ అఫీషియల్ టీజర్ ని జనవరి తొలి వారంలో టీజర్ విడుదల చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. అనంతరం దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ కార్తికేయ, నేహా శెట్టి జోడీ మధ్య కెమిస్ట్రీ ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’ వీడియోలో చూశారు. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు అంతకంటే బావుంటాయి.

మిగతా క్యారెక్టర్లు చేసే పనులు కూడా అంతే నవ్విస్తాయి. ప్రేక్షకుల నుంచి ఈ రోజు విడుదల చేసిన వీడియోకి మంచి స్పందన లభిస్తోంది. ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంది. టీజర్, ట్రైలర్, సినిమాను త్వరలో మీ ముందుకు తీసుకు రావాలని ఉందని అలానే ఈ సినిమా మీ అందరి ఆదరణ అందుకుంటుందని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు. కాగా ఈ మూవీకి యాక్షన్ ని అంజి, పృథ్వీ కాస్ట్యూమ్స్ ని అనూషా పుంజాల, ఎడిటింగ్ ని విప్లవ్ న్యాసదం, సాహిత్యాన్ని దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య అందించగా సినిమాటోగ్రఫీని సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి అందించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు