ధనుష్ “వాతి” ఆడియోపై లేటెస్ట్ బజ్.!

ధనుష్ “వాతి” ఆడియోపై లేటెస్ట్ బజ్.!

Published on Dec 31, 2022 3:01 AM IST

తమిళ గ్లోబల్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా ఇపుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో అయితే మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న బై లాంగువల్ చిత్రం “వాతి” కూడా ఒకటి. మరి ఈ చిత్రం అయితే తెలుగులో “సార్” పేరిట తెరకెక్కుతూ ఉండగా దీనిపై తమిళ్ సహా తెలుగులో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ మంచి హిట్ అయ్యింది.

ఇక ఫుల్ ఆడియో ఫంక్షన్ కోసం అయితే లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రం ఆడియో ని మేకర్స్ వచ్చే ఫిబ్రవరిలో మొదటి వారానికి గాను ప్లాన్ చేస్తున్నారట. మొదట గ్రాండ్ గా తమిళ్ లో ఈ వేడుక ఉండగా నెక్స్ట్ తెలుగులో నిర్వహించనున్నారని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతమే అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు