కమల్ హాసన్ లు ఎక్కువయ్యారు.. బండ్ల గణేష్ అన్నదెవరిని

కమల్ హాసన్ లు ఎక్కువయ్యారు.. బండ్ల గణేష్ అన్నదెవరిని

Published on May 26, 2025 7:01 PM IST

bamdla ganesh

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాతల్లో మాస్ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒకరు. మరి ఈ బ్లాక్ బస్టర్ దర్శకుడు గత కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో మంచి హంగామా చేస్తున్నారు. మెయిన్ గా తన ఆరాధ్య దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేసిన నేపథ్యంలో తన అభిమాన హీరో కోసం గట్టిగానే సోషల్ మీడియాలో స్పందించారు.

అయితే లేటెస్ట్ గా మరో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. ఆస్కార్ నటులు, కమల్ హాసన్ లు ఎక్కువయ్యిపోయారు, వీళ్ళ నటన చూడలేకపోతున్నాం అంటూ చేసిన సస్పెన్స్ ఫుల్ పోస్ట్ ఇపుడు ఆసక్తిగా మారింది. మరి తాను ఇండస్ట్రీ లోనే ఎవరినో ఉద్దేశించి కావాలనే అన్నారు అని అది ఎవరై ఉంటారు అనే చర్చ ఇపుడు మొదలైంది. మరి ఇది పవన్ కళ్యాణ్ ఇష్యూకి సంబంధించేనా కాదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు