‘బకాసుర రెస్టారెంట్’ – కుటుంబంతో కలిసి చూడదగ్గ హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో ప్రవీణ్ హీరోగా, వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటించారు. కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, గరుడరామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌జే శివ దర్శకత్వంలో, ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మించారు.
ఈ సినిమా ఆగస్టు 8న విడుదల కానుంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ, ప్రవీణ్ మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి కూడా అని, ఈ సినిమా అతనికి మంచి బ్రేక్ ఇస్తుందని అభిప్రాయపడ్డారు.
నిర్మాత జనార్థన్ మాట్లాడుతూ, కథే హీరోగా నిలిచిన ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నామని చెప్పారు. దర్శకుడు ఎస్‌జే శివ మాట్లాడుతూ, కుటుంబం మొత్తం కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమాను రూపొందించామని, ఇందులో అనేక సర్‌ప్రైజ్‌లు ఉంటాయని తెలిపారు.


