ట్యాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. దర్శకుడు మారి డైరెక్ట్ చేస్తున్న ఈ కంప్లీట్ ఎంటర్‌టైనర్ మూవీలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి.
అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ను జనవరి 7న సాయంత్రం 6.04 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు ఓ సాలిడ్ పోస్టర్‌ను కూడా వారు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌తో నవీన్ పొలిశెట్టి మరోసారి ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్నాడు.
తనదైన టైమింగ్‌తో నవీన్ పొలిశెట్టి కామెడీ పండించనుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలాంటి పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు మేకర్స్ రెడీ అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.


