37తో రాకా వరల్డ్ రికార్డు.. ఆ పోస్టర్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!

37తో రాకా వరల్డ్ రికార్డు.. ఆ పోస్టర్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!

Published on Sep 21, 2026 4:21 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘రాకా’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల ‘37’ అనే నెంబర్‌తో విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. అయితే, దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ వెనుకున్న అసలు రహస్యం బయటకు వచ్చింది.

విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన రాకా టీమ్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. గతంలో రియల్ టైమ్‌లో 19 మందితో మాత్రమే మోషన్ క్యాప్చర్ చేసిన రికార్డు ఉండగా, ఇప్పుడు ఏకంగా 37 మందితో ఈ ఘనత సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఆ ‘37’ సంఖ్య వెనుక ఉన్న నిజం ఇదే కావడం విశేషం.

ఈ ప్రపంచ రికార్డుకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ గ్లింప్స్, మేకింగ్ వీడియోను ఈ సాయంత్రం అధికారికంగా విడుదల చేయనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ మరియు ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటంగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తవుతుందని తెలుస్తోంది. ఇక ‘రాకా’ చిత్రాన్ని 2028లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు