ప్రత్యేక చిట్ చాట్ : గౌతమ్ వాసుదేవ్ మీనన్ – అల్లు అర్జున్ – నాని మల్టీ స్టారర్ గా ఓ సినిమా చేస్తాను.

ప్రత్యేక చిట్ చాట్ : గౌతమ్ వాసుదేవ్ మీనన్ – అల్లు అర్జున్ – నాని మల్టీ స్టారర్ గా ఓ సినిమా చేస్తాను.

Published on Dec 17, 2012 5:20 PM IST

gautham-menon

ప్రస్తుతం ఈ జెనరేషన్లో ఉన్న అద్భుతమైన సినిమాలు తీసే దర్శకుల్లో గౌతం వాసుదేవ్ మీనన్ ఒకడు. అతని సినిమాలు ఎంతో స్టైలిష్ గా, రియాలిటీకి దగ్గరగా, సాధారణ ప్రజలకు దగ్గరగా ఉండే పాత్రలతో సినిమాలు చేస్తుంటారు. రొమాంటిక్ మూవీస్ తీయడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న గౌతమ్ మీనన్ రీసెంట్ గా తీసిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ గత శుక్రవారం విడుదలై మిశ్రమ ఫలితాన్ని సొంతం చేసుకుంది. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తో 123తెలుగు.కామ్ ప్రత్యేకంగా ముచ్చటించింది. గౌతమ్ ఈ సినిమా విశేషాలను, తన తదుపరి సినిమా విశేషాల గురించి మాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం అందిస్తున్నాం..

ప్రశ్న) ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉంది?

స) సినిమాకి రెస్పాన్స్ బాగుంది. తమిళ్ వెర్షన్ కంటే తెలుగులో పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది.

ప్రశ్న) మీరు ఇంతక ముందు తీసిన సినిమాల్లానే ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా కూడా మీ జీవితంలోని సంఘటనల ద్వారానే తెరకెక్కిన సినిమానేనా?

స) అవును! నా లైఫ్ లో చూసిన కొన్ని సంఘటనలను, అలాగే నా అనుభవాలను మేళవించి ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా తీశాను.

ప్రశ్న) ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ లో ఏ పాయింట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిందని అనుకుంటున్నారు?

స) సినిమా స్టొరీ లైన్ చాలా సింపుల్, అలాగే లైఫ్ లోని మూడు దశలను చూపిస్తాము. అందరూ ఈ సినిమాకి పర్సనల్ గా కనెక్ట్ అయ్యారని అనుకున్నాను, కానీ దాని నుండి బయటకొచ్చి చూస్తే ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్ కి ఈ సినిమా దగ్గరగా ఉందని అర్థమయ్యింది.

ప్రశ్న) ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులకి ఈ సినిమా ఎలా సెట్ అవుతుందని అనుకున్నారు?

స) ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాని ఏ ప్రేక్షకుల కోసం తీసాననేది నాకు బాగా తెలుసు. నేను ఎవరి కోసమైతే ఈ సినిమా తీసానో, ఆ సెక్షన్ ఆడియన్స్ కి అది రీచ్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.

ప్రశ్న) నాని, సమంతల నటన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే?

స) ఈ సినిమాలో ఇద్దరి నటన చాలా సూపర్బ్ గా ఉంది. ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా తర్వాత నాని కి ఫ్యాన్ అయిపోయాను. నేను అనుకున్న దానికంటే నాని బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సమంత విషయానికొస్తే సినిమాలో ఆమెది చాలా కీలక పాత్ర అయినప్పటికీ ఎంతో ఎనర్జీతో చేసింది. డైరెక్టర్ కోరుకునే హీరోయిన్ సమంత, ఈ సినిమాలో ఎంతో పరిపక్వతతో నటించింది.

ప్రశ్న) మీరు చేయనున్న తదుపరి సినిమా విశేషాలేమిటి?

స) ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ హిందీ వెర్షన్ 50% పూర్తయ్యింది, అలాగే సూర్య హీరోగా చేసే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా 2013 ప్రారంభంలో మొదలు కానుంది.

ప్రశ్న) ప్రస్తుతం ఊపందుకుంటున్న మల్టీ స్టారర్ ట్రెండ్ విషయానికొస్తే, మీరు మల్టీ స్టారర్ సినిమా చేయాలనుకుంటే ఏ ఇద్దరి హీరోలను సెలక్ట్ చేసుకుంటారు?

స) నవ్వుతూ..! నేను నాని, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తీయాలనుకుంటున్నాను.ఈ సినిమా యాక్షన్ అంశాలు ఉండే ఒక ట్రై యాంగిల్ లవ్ స్టొరీ.

ప్రశ్న) మీరు మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ అప్డేట్స్ చెబుతారా?

స) ఈ విషయం గురించి ఇప్పుడు మాట్లాడితే చాలా తొందరపడినట్టే. మహేష్ బాబుకి కొన్ని లైన్స్ చెప్పాను కానీ ఇంకా ఏదీ ఓకే కాలేదు.

ప్రశ్న) మీకు టాలీవుడ్లో నచ్చిన యాక్టర్ మరియు డైరెక్టర్ ఎవరు?

స) హీరో మహేష్ బాబు, డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.

ప్రశ్న) చివరిగా 123తెలుగు.కామ్ పాఠకులకు మీరిచ్చే మెసేజ్ ఏమిటి?

స) నేను తీసే ప్రతి సినిమాని బిగ్ స్క్రీన్ పై చూడండి. పైరసీని అరికట్టండి, అలాగే పైరసీని అరికట్టడంలో మాకు హెల్ప్ చెయ్యండి.

అంతటితో గౌతమ్ మీనన్ తో మా చిట్ చాట్ ముగించాము. ఈ ఇంటర్వ్యూని మీరు కూడా బాగా ఎంజాయ్ చేసారని అనుకుంటున్నాం.

Translated by – Rag’s

సంబంధిత సమాచారం

తాజా వార్తలు