ఇంటర్వ్యూ : శ్రీ విష్ణు – ‘రాజ రాజ చోర’ ట్రైలర్ చూసి ఫస్ట్ వెంకటేష్ గారే కాల్ చేశారు.

ఇంటర్వ్యూ : శ్రీ విష్ణు – ‘రాజ రాజ చోర’ ట్రైలర్ చూసి ఫస్ట్ వెంకటేష్ గారే కాల్ చేశారు.

Published on Aug 18, 2021 1:15 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యూచర్ స్కోప్ ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో శ్రీ విష్ణు కూడా ఒకడు. తనదైన నటనతో మంచి ఆదరణను పెంచుకుంటూ వస్తున్న శ్రీ ఇప్పుడు మరో చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే “రాజ రాజ చోర”. మంచి బజ్ నెలకొల్పుకున్నా ఈ చిత్రం రేపు విడుదల సందర్భంగా ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మరిన్ని ఆసక్తికర విషయాలు శ్రీ విష్ణు తెలిపాడు. మరి అవేంటో చూద్దాం రండి.

వెంకటేష్ గారితో మిమ్మల్ని పోలుస్తున్నారు?

అవును, అంటే నేను కూడా ఆయన అభిమానినే కానీ ఆయనతో అంత ఈజీగా కంపేర్ చేసిన ఎందుకు పోల్చుకోవాల్సి వచ్చింది అంటే ఈ సినిమాలో ఆయన లానే మంచి కామెడీ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి, ఫామిలీ అంతా కలిసి హ్యాపీ గా చూడొచ్చేని కావచ్చు సినిమా చూసాక వీటన్నిటి వల్ల ఎక్కడో ఆ యాంగిల్ నాలో నాకే అనిపించింది. దాని వల్ల బహుశా అనిపించి ఉంటుంది.

మరి వెంకటేష్ గారు ఏమన్నారు? మీకేమన్న సలహాలు ఇచ్చారా?

ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. సినిమా స్టార్ట్ చెయ్యడానికి ముందే ఓసారి మాట్లాడాను ఇలా సినిమా ప్లాన్ చేద్దాం అనుకున్నాం అలాగే ట్రైలర్ రిలీజ్ అయ్యాక కూడా ఆయనే ముందు రెస్పొంద్ అయ్యి నా కోసం చెప్పారు. కామెడీ టైమింగ్ బాగుంది బా చేస్తున్నావ్ అని. అప్పుడు మీట్ అవుదాం అనుకున్నాం కానీ ప్యాండమిక్ వల్ల కుదరలేదు. సో ఇప్పుడు ఇలా ప్రమోషన్స్ వరకు వచ్చారు. అలాగే చాలా వరకు సలహాలు ఇచ్చారు. ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలి ఎప్పుడు ఎలాంటి సినిమాలు పిక్ చెయ్యాలి అని. లేటెస్ట్ గా అయితే అన్ని బాగా చేస్తున్నావ్ మాస్ సినిమాలు కూడా చెయ్యాలని చెప్పారు. మాస్ అంటే ఎగిరేసి కొట్టేయడం లాంటి సినిమాలు కాదు కాస్త డిఫరెంట్ గా ఉండేవి చేస్తున్నాను.

ప్రీ రిలీజ్ లో చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు, అంత నమ్మకం ఏంటి?

కథ వల్లనే నేను అంత నమ్మకంగా కాన్ఫిడెన్స్ గా మాట్లాడాను. నిజంగా బాగా కుదిరింది. దానికోసం ఎక్కువ రివీల్ చేసేసి ఎగ్జైట్మెంట్ ని పాడు చెయ్యకూడదు, అలా ఆడియెన్స్ ని నా సినిమాలకి రప్పించుకోవాలని ఎప్పుడూ అనుకోను ఒకవేళ బాగోకపోతే డిజప్పాయింట్ అవుతారని ఎక్కువ చెప్పాలి అనుకోను. నా కథ సినిమా నేను వర్క్ చేసినప్పుడు ఎక్స్ పీరియన్స్ అవే చెప్తాను నేను.

మీ సినిమా చూసారా? ఏమనిపించింది?

నేను సినిమా చూసాను.. చాలా కొత్త రకం ఫీల్ అనిపించింది. కొత్త స్టోరీ టెల్లింగ్ ఇందులో కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ ఎలా అయితే ఇతర ఓటిటి సినిమాలు చూసి చెప్పుకుంటున్నారో అలాంటి వాటిలో మన తెలుగు సినిమాగా ఇది ఉంటుంది అని చెప్పగలను. అంత కొత్త కథ ఈ జానర్ లో ఈ సినిమా పై నేను ఎగ్జైటెడ్ గా ఉన్నా.

చెప్పండి మీ రోల్ ఎలా ఉండబోతుంది?

నాది దొంగ రోల్. దొంగ అంటే పెద్ద పెద్ద స్కాములు అలాంటివి ఏముండవు చిన్న దొంగ కొంటె పనులు చేస్తుంటాడు. సినిమా 15 నిమిషాల్లోనే అందరి రోల్స్ ఎంటర్ అయ్యిపోతాయి. నాది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది హిలేరియస్ గా ఉంటుంది. చాలా త్వరగా నా రోల్ కి అందరూ కనెక్ట్ అవుతారు అది చెప్పగలను.

ఈ సినిమాని పాన్ ఇండియన్ స్టఫ్ అన్నారు ఆ లెవెల్లో ఉంటుందా?

పాన్ ఇండియన్ లో అంటే ఇప్పటికే నేను చెప్పుకోలేదు కానీ నేను చేసిన సినిమాలు మిగతా భాషల్లో కూడా రీమేక్ లు చేశారు. కానీ ఇందులో అంతకు మించిన కథ ఉంది కాబట్టే నేను నమ్మకంగా దీనిని పాన్ ఇండియన్ స్టఫ్ అని చెప్పగలిగాను. అలా అని అందరూ లైట్స్ వేసుకొచ్చేసి సినిమా చేసేస్తారని చెప్పలేదు. ఏ భాషలో ఈ సినిమాని చేసినా హిట్టవుతుంది అని ఆ యాంగిల్ లో చెప్పా.

డైరెక్టర్ మీకు దీనికన్నా ముందు ఇంకో స్క్రిప్ట్ చెప్పారట? మరి ఇదెలా ముందుకొచ్చింది?

ఈ సినిమా కన్నా ముందు హసిత్ ఇంకో స్టోరీ చెప్పాడు కానీ అది కంప్లీట్ డిఫరెంట్ జానర్ లో ఉంటుంది. దీనిలా కాదు ఒక ట్రావెలింగ్ స్టోరీలా డిసీజ్ ఓరియెంటెడ్ చిత్రం అది అయితే ముందు అదే చేసేస్తే ఎక్కడైనా తేడా కొడుతుంది ఏమో అపుడే అలాంటి స్క్రిప్ట్ ఎందుకు? ముందు ఇంకోదానితో ప్రూవ్ చేసుకొని అలాంటివి చేద్దాం అని ఇది స్టార్ట్ చేసాం అంతే.

సినిమా చూసాక అంతా వివేక్ సాగర్ మ్యూజిక్ కోసమే మాట్లాడుతారు అంటున్నారు?

అవును ఖచ్చితంగా వివేక్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా చూసి వచ్చాక ఫస్ట్ మాట్లాడుకునేది వివేక్ సాగర్ మ్యూజిక్ కోసమే. సినిమా అంతా ఎలా ఉన్నా కూడా మ్యూజిక్ బాగోకపోతే చెప్పలేం. నా ముందు సినిమాలు అన్నీ చూస్తే లాస్ట్ 15 నిముషాలు అలా మంచి టోన్ లో ఉంటుంది ఆ మ్యూజిక్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇందులో కూడా అలాగే ఉంటుంది. సిద్ ఎంట్రీ కూడా అక్కడే ఉంటుంది.

మరి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ఇప్పుడు రాజ రాజ చోర తర్వాత అర్జున ఫాల్గుణ ఉంది ఒక సాంగ్ బాలన్స్ ఉంది, ఇంకా చైతు తో ‘భళా తందనాన’ కూడా చేస్తున్న. వీటితో పాటుగా ఒక పోలీస్ ఆఫీసర్ బయోపిక్ కూడా చేస్తున్నా.

ఇక ఫైనల్ గా ఆడియెన్స్ ని ఎంత వరకు మీరు దోచుకుంటారు?

ఆడియెన్స్ ఎలాంటి ఫలితం ఇచ్చినా ఒకే. అది సూపర్ హిట్టా లేక బ్లాక్ బస్టరా అన్నది రేపు తెలుస్తుంది. కానీ మేము మాత్రం ఒక హానెస్ట్ అటెంప్ట్ చేసాం అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుంది అనే నమ్మకం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు