ఇంటర్వ్యూ : ‘రైటర్ పద్మభూషణ్‌’ అందరినీ ఎంతో బాగా ఎంటర్టైన్ చేస్తాడు – యాక్టర్ సుహాస్

ఇంటర్వ్యూ : ‘రైటర్ పద్మభూషణ్‌’ అందరినీ ఎంతో బాగా ఎంటర్టైన్ చేస్తాడు – యాక్టర్ సుహాస్

Published on Jan 26, 2023 7:00 PM IST

 

కెరీర్ పరంగా చిన్న స్థాయి నుండి ఎంతో కష్టపడి పైకి వచ్చి ప్రస్తుతం మంచి అవకాశాలతో కొనసాగుతున్న వారిలో యువ నటుడు సుహాస్ కూడా ఒకరు. ఇటీవల వచ్చిన కలర్ ఫోటో మూవీలో హీరోగా నటించి అందరినీ అలరించిన సుహాస్ ప్రస్తుతం చేస్తున్న మూవీ రైటర్ పద్మభూషణ్. యువ దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన రైటర్ పద్మభూషణ్ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ కలిసి దీనిని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ఆశిష్ విద్యార్థి, రోహిణి, కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా నటించారు. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 3న రిలీజ్ కానున్న సందర్భంగా నేడు మీడియాతో మూవీ అనుభవాలను పంచుకున్నరు సుహాస్.

 

రైటర్ పద్మభూషణ్‌ ప్రయాణం ఎలా మొదలైయింది ?
నేను చేసిన కలర్ ఫోటో సినిమాకి ప్రశాంత్ సహాయ దర్శకుడు. తర్వాత ఫ్యామిలీ డ్రామా అనే సినిమా చేశాను దానికి ప్రశాంత్ రైటర్ గా వర్క్ చేసాడు. ఆ విధంగా తనతో పరిచయం ఏర్పడడం, ఇక కలర్ ఫోటో తర్వాత ఈ కథ చెప్పాడం జరిగింది. విన్నాక చాలా ఎక్సయిట్ అయ్యాం. నిర్మాతలు అనురాగ్, శరత్ కి చెప్పాం. వారూ ఎక్సయిట్ అయ్యి వెంటనే తెరకెక్కించారు. ఆ విధంగా ఈ మూవీ ప్రారంభం అయింది.

 

మరి మిమ్మల్ని ఇందులో అంత ఎక్సయిట్ అయ్యేలా చేసిన పాయింట్ ఏమిటి ?
నిజానికి ఈ సినిమా అంతా చాలా ఎక్సయిటింగా వుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ కి అందరూ కనెక్ట్ అవుతారు. రైటర్ పద్మభూషణ్‌ ఖచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తాడు. ఇందులో అనుమానమే లేదు. మా అందరి కెరీర్ కి ఇది మరింత ప్లస్ అవుతుందనే నమ్మకం ఉంది.

 

మరి ఈ మూవీలో సస్పెన్స్ ట్విస్ట్ వంటి ఎలిమెంట్స్ ఉంటాయా ?
ఎస్ వుంటాయి, ఫస్ట్ హాఫ్ లో రెండు, సెకండ్ హాఫ్ లో మూడు ట్విస్ట్ లు వస్తాయి. క్లైమాక్స్ లో ఇంకా మంచి ట్విస్ట్ వుంటుంది. ప్రతి మలుపుని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే స్క్రిప్ట్ విన్న వెంటనే అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో చేసాము.

 

ఈ కథకు నిర్మాతలని మీరు ఒప్పించారా లేదా దర్శకుడా ?
నిజానికి ఈ మూవీ యొక్క కంటెంట్ తనదే కాబట్టి ఆ భాద్యత తనపైనే వుంటుంది. అయితే నేను ఒక సోర్స్ గా మాత్రమే వున్నాను. మా హోం బ్యానర్ కాబట్టి ఒకసారి కథ వినండనని చెప్పాను. ఈ కంటెంట్ కి ఎవరైనా ఎక్సయిట్ అవుతారు. చాలా మంచి కంటెంట్. అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఇక మేము ట్రైలర్ లో చెప్పనిది ఒకటి సినిమాలో వస్తుంది. సినిమా చూసిన తర్వాత అది అర్ధమౌతుంది.

 

మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏమిటి ?
కలర్ ఫోటో సినిమా నా కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్. ఆ సినిమా చాలా ఇష్టం. అలాగే తెరపై నన్ను నేను చూసుకున్న సినిమా మజిలీ. అలా తెరపై చూసుకోవడంలో ఆ ఆనందమే వేరు. ఇవి రెండు నాకు ఎంతో ఇష్టం.

 

ఛాయ్ బిస్కెట్ గురించి ?
వారితో కలిసి నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చాను. ఆ బాండింగ్ ఎప్పటికీ ఖచ్చితంగా వుంటుంది. అక్కడ ఉన్నప్పుడు సినిమాలకి ప్రమోషన్స్ చేయడం వలన చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో సినిమాలోకి వచ్చిన తర్వాత మరింత సులువైయింది. ఆ విధంగా ఛాయ్ బిస్కెట్ వారి అనుబంధం షార్ట్ ఫిల్మ్ తో మొదలై ఈ రోజు సినిమా చేస్తున్నామంటే చాలా ఆనందంగా గర్వంగా వుంది. తప్పకుండా వారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది.

 

మీకు డ్రీం రోల్స్ ఏమైనా ఉన్నాయా ?
మొదట చిన్న పాత్రలు చేస్తే చాలు అని అనుకున్నాను. ఆడియన్స్ నటుడిగా ఆదరిస్తున్నందువలన చాలా మంచి పాత్రలు వస్తున్నాయి. రచయితల వలన చాలా భిన్నమైన పాత్రలు చేసే అవకాశం వస్తుంది. వచ్చిన పాత్రకు ఎలా న్యాయం చేయాలనే దానిపైనె నా ద్రుష్టి వుంది. ప్రత్యేకంగా డ్రీమ్ రోల్స్ అనేవి లేవు.

 

రైటర్ పద్మభూషణ్‌ నటీనటుల గురించి ?
ఆశిష్ విద్యార్ధి గారు, రోహిణీ గారు లాంటి సీనియర్ నటులు ఇందులో భాగం కావడం అదృష్టం. వారికి కథ ఎంతో బాగా నచ్చి వర్క్ చేశారు. అలాగే గోపరాజు రమణ గారు హీరోయిన్ ఫాదర్ గా మంచి పాత్ర చేశారు. ఇందులో హీరోయిన్ నాకు మరదలి వరస అవుతుంది. మిగతా పాత్రధారులు అందరూ కూడా ఎంతో బాగా పెర్ఫార్మ్ చేసారు. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది.

 

చివరిగా రైటర్ పద్మభూషణ్‌ గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు ?
మా టీమ్ మొత్తం కూడా ఎంతో కష్టపడి వర్క్ చేసిన ఈ మూవీతో ప్రేక్షకులు కచ్చితంగా ఎంటర్ టైన్ అవుతారు. హెవీ హార్ట్ ఫీలింగ్ తో మంచి చిరునవ్వుతో బయటికివస్తారు. మంచి సినిమా చేశారని అభినందిస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నన్ను ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.

ఆల్ ది బెస్ట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు