ఇంటర్వ్యూ : ‘అలా మొదలైంది’ సినిమా ఆఫర్ వదులుకున్నాను : ఉధయనిది స్టాలిన్

ఇంటర్వ్యూ : ‘అలా మొదలైంది’ సినిమా ఆఫర్ వదులుకున్నాను : ఉధయనిది స్టాలిన్

Published on Aug 29, 2012 5:30 PM IST


ఉదయనిధి స్టాలిన్ తమిళ చిత్ర సీమకు మొదట నిర్మాతగా పరిచయమై, ఆ తర్వాత హీరోగా మారారు. ఆయన హీరోగా నటించిన మొదటి చిత్రం ‘ఓకే ఓకే’ (ఒరు కల్ ఒరు కన్నాడి) చిత్రం తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాదించింది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో ఆగష్టు 31న విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదల సందర్భంగా ఉధయనిది స్టాలిన్ కాసేపు పత్రికా విలేకరులతో ముచ్చటించారు.. ఆ వివరాలు మీకందిస్తున్నాము…

ప్రశ్న) నటుడిగా మీ మొదటి చిత్రం ఇదేనా ?

స : కాదండి.. సూర్య హీరోగా నటించిన ‘ఘటికుడు (అధవన్)’ చిత్రంలో ఒక చిన్నఅతిధి పాత్రలో నటించాను. నేను నటుడిగా మారడానికి అదే మూలం. ఆ సినిమా తర్వాత డైరెక్టర్ ఎం.రాజేష్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేశాను.

ప్రశ్న) మీకు నిర్మాతగా మరియు నటుడిగా చేసారు. ఈ రెండింటిలో ఏది కష్టమనిపించింది?

స: రెండింటిలో నటుడిగా ప్రేక్షకుల్ని మెప్పిచడమే కష్టమైన పని, ఎందుకంటే నిర్మాతగా నాకు సినిమాకి సంభందించిన అన్ని విభాగాల మీద పట్టుంది. నటుడిగా ప్రేక్షకులను మెప్పించడం నాకు చాలా కష్టమనిపించింది. యాక్షన్ సీన్స్ చేయడం మరియు డాన్సులు చాలా కష్టమైన పని అందుకే యాక్టింగ్ చాలా కష్టం.

ప్రశ్న) ఈ మధ్య కాలంలో ఏమైనా తెలుగు సినిమాలు చూసారా? ఏ సినిమాలు మీకు బాగా నచ్చాయి?

స : చూసాను… అందులో ‘100% లవ్’, ‘మర్యాద రామన్న’ మరియు ‘అలా మొదలైంది’ చిత్రాలు నాకు బాగా నచ్చాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ‘అలా మొదలైంది’ తమిళ వర్షన్ లో నటించే అవకాశం నాకు వచ్చింది, కానీ ఆ పాత్రకి నేను పూర్తి న్యాయం చెయ్యలేను అని నేను ఆ సినిమాని వదులుకున్నాను.

ప్రశ్న) హీరోగా మీరు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?

స : నా బాడీ లాంగ్వేజ్ కి యాక్షన్ సినిమాల కంటే కామెడీ తరహా పాత్రలే బాగుంటాయని నా అభిప్రాయం. అందుకే నేను కామెడీ తరహా సినిమాలే చేయాలనుకుంటున్నాను.

ప్రశ్న ) నిర్మాతగా తెలుగులో ఏమన్నా సినిమాలు చేయాలనుకుంటున్నారు?

స : అలాంటి ఆలోచన ఏమీ లేదు. ప్రస్తుతం ఒక్క తమిళ ఇండస్ట్రీ మీదే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఏమో భవిష్యత్తులో తెలుగులో చేసే అవకాశం ఉండవచ్చు.!

ప్రశ్న) ‘ఓకే ఓకే’ సినిమా తెలుగు వర్షన్ చూసారా? ఎలా అనిపించింది?

స : ‘ఓకే ఓకే’ సినిమాని తెలుగులో చూసాను. సినిమా చాలా బాగుంది, ముఖ్యంగా సంతానం పాత్రకి సునీల్ గారు చెప్పిన డబ్బింగ్ పూర్తి ఎంటర్టైనింగ్ గా ఉంది. సునీల్ గారు ఎలా ఉందో అలా డబ్బింగ్ చెప్పకుండా తెలుగు నేటివిటీకి కుదిరేలా మార్చి చెప్పారు, అది ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

ప్రశ్న) తెలుగులో ఎంతో మంది పెద్ద నిర్మాతలు ఉండగా బెల్లంకొండ సురేష్ గారిని నిర్మాతగా ఎందుకు ఎన్నుకొన్నారు?

స : బెల్లంకొండ సురేష్ గారు కూడా తెలుగులో పెద్ద నిర్మాతే కదా.. ఆయన ‘ఓకే ఓకే’ చిత్రం తమిళంలో విడుదలైన మొదటి రోజే సినిమా చూసి నా ఆఫీసు కి వచ్చి నన్ను అభినందించారు. అప్పుడే అడిగారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేద్దాం అని, తమిళంలో హిట్ అయితే అలాగే చేద్దాం అని అన్నాను. తమిళంలో అనుకున్నదాని కంటే పెద్ద హిట్ అవడంతో ఈ చిత్రాన్ని తెలుగులో అయన బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నాం.

ప్రశ్న) తమిళ మరియు తెలుగు చిత్ర సీమలో మీకు నచ్చిన అభిమాన నటులు ఎవరు?

స : తమిళంలో సూర్య గారు మరియు జీవా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వారిద్దరూ యాక్షన్, రొమాంటిక్, హాఫ్ బీట్ ఇలా ఎలాంటి సినిమా అయినా చాలా అవలీలగా చేయగలరు. అందుకనే నాకు వారంటే చాలా ఇష్టం. తెలుగులో అయితే నాగార్జున అంటే ఇష్టం ఆయన నటించిన ‘ఉదయం (తెలుగులో శివ)’ చిత్రం నుంచి ఆయనంటే నాకు ఇష్టం.

ప్రశ్న) హీరోయిన్ హన్సికతో పనిచెయ్యడం ఎలా ఉంది?

స : హన్సిక చాలా మంచి కో స్టార్. నాకు ఇదే మొదటి చిత్రం కావడం వల్ల ఆమెతో డాన్సులు చేసేటప్పుడు కాస్త ఇబ్బంది పడ్డాను. హన్సిక మంచి డాన్సర్. షూటింగ్ మొదలైన కొన్ని రోజులకి బాగా పరిచయం అయిన తర్వాత అంతా సాఫీగానే సాగిపోయింది.

ప్రశ్న) మీ మొదటి సినిమా చూసి మీ కుటుంభ సభ్యులు ఏమన్నారు?

స : నా కుటుంభ సభ్యులంతా నా నటనను చూసి చాలా బాగా చేసావు అని మెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే మంచి పేరు మరియు సినిమా హిట్ అయినందుకు వారు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మా తాత గారు(కరుణానిధి గారు) ఈ సినిమాని రెండుసార్లు చూసారు, అలాగే మా నాన్నమ్మ కూడా నా నటనను చాలా అభినందించారు.

ప్రశ్న) మీరు కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా?

స : లేదండి… నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మంచి హీరోగా మరియు అభిరుచిగల చిత్రాలు నిర్మించే నిర్మాతగా ఉండాలనుకుంటున్నాను.

ప్రశ్న) మీరు నిర్మాతగా మరియు హీరోగా చేస్తున్న తదుపరి చిత్రాలేమిటి?

స : ప్రస్తుతం తమిళంలో నిర్మాతగా రెండు చిత్రాలు త్వరలోనే ప్రారంబించానున్నాను. అలాగే సుందర్.సి తో ఒక సినిమా కోసం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత ఆ కథకి నేను సరిపోతే నేనే హీరోగా ఆ సినిమా చేస్తాను లేదంటే ఆ సినిమాని నేనే నిర్మిస్తాను.

ఆ మాటకి పత్రికా విలేఖరులందరూ ‘ఓకే ఓకే’ అనడంతో ఇంటర్వ్యూ ముగిసింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఓకే ఓకే’ చిత్రం తెలుగులో కూడా విజయం సాదించి ఉధయనిది స్టాలిన్ కి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు