మహేష్ 101 నాట్ అవుట్..!

Published on Jan 21, 2020 10:21 am IST

వీకెండ్ ముగిసినా మహేష్ సరిలేరు నీకెవ్వరు వసూళ్ల జోరు తగ్గలేదు. సోమవారంతో తెలుగు రాష్ట్రాల పరిధిలోనే ఈ చిత్ర వసూళ్లు వంద కోట్ల షేర్ కి చేరుకున్నాయి. నైజాం లో సరిలేరు నీకెవ్వరు 10 రోజులకు రూ. 33.0 కోట్ల షేర్ రాబట్టింది. మహేష్ కెరీర్ లో హైయెస్ట్ నైజాం కలెక్షన్స్ సాధించిన చిత్రంగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది.

సీడెడ్ లో రూ. 14.65 కోట్లు, గుంటూరులో రూ. 9.03 కోట్లు, కృష్ణ రూ.7.97 కోట్ల షేర్, ఉత్తరాంధ్ర రూ.17.07 కోట్లు వసూలు చేసింది. చాలా ఏరియాలలో సరిలేరు నీకెవ్వరు బ్రేక్ ఈవెన్ దాటి లాభాలలోకి ప్రవేశించింది. దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.

ప్రాంతాల వారీగా 10 రోజులకు ఏపీ/తెలంగాణాలలో కలెక్షన్స్ వివరాలు…

ఏరియా కలెక్షన్స్
నైజాం Rs 33.0 కోట్లు
సీడెడ్ Rs 14.65 కోట్లు
ఉత్తరాంధ్ర Rs 17.07 కోట్లు
గుంటూరు Rs 9.03 కోట్లు
ఈస్ట్ Rs 10.06 కోట్లు
వెస్ట్ Rs 6.57 కోట్లు
కృష్ణ Rs 7.97 కోట్లు
నెల్లూరు Rs 3.62 కోట్లు
మొత్తం ఏపి & తెలంగాణ 10 రోజుల షేర్ Rs 101.97 కోట్లు

సంబంధిత సమాచారం :